
- మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఫైర్.
మహబూబ్ నగర్ టౌన్ (తెలంగాణ సాహితి)మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి తో పాటు మాజీ ఎమ్మెల్యే ఎస్ రాజేందర్రెడ్డి తో కలిసి ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో కెసిఆర్ చావాలని మాట్లాడుతున్న షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సోయి ఉందా మందు తాగి మాట్లాడుతున్నావా అంటూ మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఫైర్ అయ్యారు.
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి తో పాటు మాజీ ఎమ్మెల్యే ఎస్ రాజేందర్రెడ్డి తో కలిసి ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాణాలను తగ్గించి కొట్లాడి తెలంగాణ తెచ్చి, తెలంగాణ ప్రజల ఆరాధ్యుడుగా ఉన్న కేసీఆర్ చావు కోరడం ఏంటని మతిభ్రమించిందా అంటూ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నాయకుల ఫ్రస్టేషన్ బిఆర్ఎస్ నిరసనలకు ప్రజల మద్దతు కాంగ్రెస్ నాయకులు ఫ్రస్టేషన్లో ఉన్నారని వెయ్యి రోజుల పాలనా పై హామీల అమలుపై గత వారం రోజులుగా బి.ఆర్.ఎస్ ఆధ్వర్యంలో చేపడుతున్న నిరసనలకు ప్రజల మద్దతు చూసి భయపడుతున్నారని ఆరోపించారు.
ఇప్పుడు కాంగ్రెస్ వారి తీరు లా తాము కూడా గత 15లలో వ్యవహరించి ఉంటే ఒక్క కాంగ్రెస్ నాయకుడు అయిన తెలుగే వారా అంటూ మాట్లాడారు. పార్లమెంట్లో రాహుల్ గాంధీ తన ఎంపీలతో కలిసి నల్లచొక్కా వేసుకొని నిరసనలు తెలుపవచ్చు కానీ తెలంగాణ అసెంబ్లీలో బి ఆర్ ఎస్ నేతలు నల్ల చొక్కా వేసుకొని నిరసన తెలపద్దా ఇదే ప్రజాస్వామ్యం అంటూ ప్రశ్నించారు.కాంగ్రెస్ మరో రెండేళ్లు అధికారంలో ఉండాలని తాము పోరాడి మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.హామీల అమలు చేసే వరకు పోరాటం చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.
Tags
Telangana