మక్తల్ (తెలంగాణ సాహితి) సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో మక్తల్ సివిల్ హాస్పిటల్లో సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు.సంస్థ నేషనల్ చైర్మన్ హైకోర్టు న్యాయవాది డా. శ్రీ కొప్పుల విజయ్ కుమార్, తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జి ఎండి. సాదిక్ అలీ ఆదేశాల మేరకు,మక్తల్ మండల చైర్మన్ఎ.భగవాన్ ఆధ్వర్యంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు ఆసుపత్రి సిబ్బందికి సుమారు 200 మందికి పండ్లు, బ్రెడ్, బిస్కెట్లు,అల్పాహారం మరియు పులిహోర భోజనం పంపిణీ చేశారు.ముఖ్య అతిథిగా మక్తల్ టౌన్ ఏ.ఎస్.ఐ. బి.సురేష్ కుమార్ హాజరయ్యారు.ఈ సందర్భంగా సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జి ఎండి. సాదిక్ అలీ,ఏ.ఎస్.ఐ.బి.సురేష్ కుమార్ నీ సన్మానించి గౌరవించారు.
ఈ సందర్భంగా ఎండి. సాదిక్ అలీ మాట్లాడుతూ, “మానవత్వంతో సేవ చేయడం, బాధితులకు అండగా నిలవడం, అవసరంలో ఉన్న వారికి చేతనైన సహాయం అందించడం మా సంస్థ ప్రధాన లక్ష్యం అని. మానవ హక్కుల పరిరక్షణతో పాటు ప్రజల్లో చట్టాలు, హక్కులపై అవగాహన పెంపొందిస్తూ సామాజిక సేవా కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తున్నాంఅని. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు,వారి కుటుంబ సభ్యులకు మనం అందించే చిన్న సహాయం కూడా వారికి ఎంతో ధైర్యాన్ని, భరోసాను ఇస్తుందనీ తెలిపారు.
డా. శ్రీ కొప్పుల విజయ్ కుమార్ మార్గదర్శకత్వంలో ప్రజల సమస్యల పరిష్కారానికి చట్టబద్ధంగా కృషి చేస్తూ, సేవే లక్ష్యంగా తమా సంస్థ ముందుకు సాగుతుంది” అని తెలిపారు.ఈ కార్యక్రమంలో మహబూబ్నగర్ టౌన్ చైర్మన్ ఎం. లక్ష్మీకాంత్, మహబూబ్నగర్ టౌన్ వైస్ చైర్మన్ వి. గిరిప్రసాద్, ఉట్కూరు టౌన్ చైర్మన్ శివ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సంస్థ సభ్యులు, ఆసుపత్రి సిబ్బంది, పోలీసు అధికారులు మరియు సహకరించిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Tags
Telangana

