ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా - TPUS
మహబూబ్ నగర్(తెలంగాణసాహితి) మహబూబ్ నగర్ పద్మశాలి ఉద్యోగుల సంఘం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వారి ఆధ్వర్యంలో జిల్లాకు చెందిన పద్మశాలి విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల కార్యక్రమం ఆదివారం మహబూబ్ నగర్ లోని అయ్యప్ప కొండ, పద్మావతి కాలనీలోని,శ్రీ శివ మార్కండేయ దేవాలయం నందు ఏర్పాటు చేయడం జరిగింది.జిల్లా అధ్యక్షులు కెంచె సుభాష్ చంద్ర ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, నీట్, ఐఐటి, మరియు ఎన్ఐటి ప్రవేశ పరీక్షలో, ఇంకా ఉన్నత విద్యలలో అత్యధిక మార్కులతో రాణించిన దాదాపు 50 మందికి బాలబాలికలకు ఎన్నుకొని వారికి సర్టిఫికెట్ మరియు మేమెంటో లను అందజేశారు.అదేవిధంగా ఉత్తమ ఉద్యోగులుగా అవార్డు పొందిన ఉద్యోగులకు, ప్రతిభ కనపరిచిన ఉద్యోగులకు మరియు పదవీ విరమణ చేసిన విశ్రాంత పద్మశాలి ఉద్యోగస్తులకు, జిల్లాలోని వివిధ హోదాల్లో పనిచేస్తున్న పద్మశాలి ఉద్యోగులకు శాలువా కప్పి మెమెంటో ద్వారా సన్మానించడం జరిగింది. అనంతరం వనభోజనాలు చేశారు.

ఈ కార్యక్రమానికి సందర్భంగా విశిష్ట అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు ఈగ వెంకటేశ్వర్లు,ఆలె బాలకృష్ణ, టిపియూఎస్ స్టేట్ సెక్రెటరీ కురి సత్యనారాయణ అండ్ సిరందాస్ సంఘం రాష్ట్ర ప్రతినిధులు మాట్లాడుతూ.సంక్షేమ పథకాలు గత కొన్ని సంవత్సరాల నుండి పద్మశాలి ఉద్యోగుల సంఘం నుండి అందజేయడం జరుగుతుందని, పేద విద్యార్థులలో ప్రతిభావంతులకు,పై చదువుల నిమిత్తం ఆర్థిక సహాయ సహకారాలు, పేద పద్మశాలీలకు వైద్య పరంగా కూడా తదితర వంటి అంశాలు అధిక మొత్తంలో ఆర్థికంగానూ చేయూతను కూడా అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్ధులు వారి తల్లిదండ్రులు మరియు ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు వివిధ ప్రదేశాల నుంచి అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పానుగంటి బాలరాజ్ అఖిల భారతీయ పద్మశాలి సంఘం కార్యదర్శి, శ్రీ అప్పం అనంతరములు జిల్లా ప్రెసిడెంట్ ర్రాష్ట్ర మరియు జిల్లా కార్యవర్గ ప్రతినిధులు కుకుడాల బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి, కడుదాసు శ్రీనివాసులు, అరుపుల దివాకర్, ధర్మపురి సునీల్ కుమార్,వస్త్రాల ఆంజనేయులు, మాకం శ్యామ్ సుందర్,పల్లాటి రఘురాములు,కుకుడాల శ్రీనివాస్, జన్ను వెంకటస్వామి,గుర్రం క్రిష్ణయ్య, శ్రీమతి పాలాది కరుణ, బీంపల్లీ శ్రీనివాసులు, కెంచె రామచంద్రయ్య,కెంచె మహేష్ కుమార్, బోగం వెంకటేశ్, దాసువెంకటేష్, పల్లాటి బాల్రరాజ్, కోడి రాజశేఖర్, కోగంరి వేంకటేష్, సత్యనారాయణ, బిజ్జు శంకర్, కే .సుకుమార్, శివాజి,జన్ను వెంకటేష్ నాయకులు దేవాలయ కమిటీ మెంబర్లు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసారు.

