కాళోజీ జయంతి సందర్భంగా ప్రజాకవి సేవలను స్మరించుకున్న జిల్లా ఎస్పీ డి.జానకి,

మహబూబ్ నగర్ (తెలంగాణ సాహితి)తెలంగాణ ప్రజాకవి, సాహితీవేత్త, స్వాతంత్ర్య సమరయోధుడు కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని మహబూబ్‌నగర్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి.జానకి,కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం ఎస్పీ మాట్లాడుతూ కాళోజీ నారాయణరావు తన రచనలు,కవిత్వం ద్వారా ప్రజల సమస్యలను సమాజం ముందుకు తీసుకువచ్చిన గొప్ప ప్రజాకవి అని అన్నారు.

తెలంగాణ ప్రజల జీవన విధానం,సామాజిక పరిస్థితులు,ప్రజల ఆకాంక్షలను తన సాహిత్యంలో ప్రతిబింబిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.

అన్యాయం,అసమానతలు,సామాజిక రుగ్మతలను ప్రశ్నిస్తూ ప్రజల్లో చైతన్యాన్ని నింపిన కాళోజీ ఆలోచనలు నేటి తరానికి కూడా స్ఫూర్తిదాయకమని ఎస్పీ గారు అన్నారు.

ప్రజాస్వామ్య విలువలు,సామాజిక బాధ్యత,మానవతా దృక్పథం వంటి ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

కాళోజీ నారాయణరావు ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని పోలీసు అధికారులు,సిబ్బంది ప్రజలకు మరింత చేరువగా ఉంటూ,వారి సమస్యలను సానుభూతితో పరిష్కరిస్తూ సమర్థవంతమైన పోలీసింగ్ అందించాలని ఎస్పీ గారు సూచించారు.ఈ కార్యక్రమంలో AR అదనపు ఎస్పీ సురేష్ కుమార్, DCRB DSP రమణా రెడ్డి, RI లు కృష్ణయ్య అశోక్ కుమార్, RSI లు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు సిబ్బంది పాల్గొని కాళోజీ నారాయణరావుకు ఘన నివాళులు అర్పించారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

Ad 2