కబ్జా కోరల్లో దేవుడి భూములు

- అమ్మాపురంలో రెవెన్యూ దేవాదాయ శాఖల సంయుక్త సర్వే
- ఆక్రమణల ఆరోపణల నేపథ్యంలో కదిలిన యంత్రాంగం.
- స్వామివారి ఆస్తులను కాపాడాలని గ్రామస్థుల డిమాండ్.

మహబూబాబాద్(తెలంగాణసాహితి) మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం అమ్మాపురం గ్రామంలో వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ భూములపై నెలకొన్న వివాదాలకు తెరదించేందుకు అధికారులు రంగంలోకి దిగారు ఆలయానికి చెందిన విలువైన భూములు అక్రమంగా కబ్జాకు గురవుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో రెవెన్యూ మరియు దేవాదాయ శాఖల అధికారులు సంయుక్తంగా బుధవారం నాడు గ్రామంలో భూ సర్వే నిర్వహించారు.

గత కొంతకాలంగా ఆలయ భూములను కొంతమంది స్థానిక ప్రాబల్యమున్న వ్యక్తులు ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని దీనివల్ల దేవుడి ఆస్తులు పరులపాలవుతున్నాయని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చారు ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందడంతో బుధవారం ఉదయం అధికారుల బృందం సర్వే సిబ్బందితో కలిసి వివాదాస్పద భూముల్లో క్షేత్రస్థాయి పరిశీలన జరిపింది ఆలయ రికార్డుల ప్రకారం ఉన్న సరిహద్దులను ప్రస్తుతం ఆధీనంలో ఉన్న భూములను క్షుణ్ణంగా కొలిచి మ్యాపింగ్ చేశారు.

ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ ఎంతో పవిత్రమైన వేంకటేశ్వర స్వామి ఆలయ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్వామివారి భూములను స్వాధీనం చేసుకుని ఆలయ అభివృద్ధికి ఉపయోగపడేలా గట్టి చర్యలు చేపట్టాలని కోరారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

Ad 2