(కుత్బుల్లాపూర్ తెలంగాణ సాహితి ప్రతినిధి) కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బీరప్ప నగర్లో గల శ్రీ బీరప్ప స్వామి ఆలయంలో శ్రావణ మాస బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి పాల్గొని బీరప్ప స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు..అనంతరం హనుమంత్ రెడ్డి, బీరప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో మల్టీపర్పస్ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు..ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చొరవతో రూ.1 కోటి 2 లక్షల నిధులు మంజూరు కావడంతో ఈ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ .ఎం.గౌరీష్ డివిజన్ అధ్యక్షులు, మహిళ నాయకులు, కురుమ సంఘం కమిటీ సభ్యులు, కురుమ కులస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Tags
Telangana