-బిఆర్ టియూ,శ్రమశక్తి అవార్డు గ్రహీత రవి.
(కుత్బుల్లాపూర్ తెలంగాణ సాహితి ప్రతినిధి) అధికారమదంతో ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నాలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే మానుకోవాలని బిఆర్ టియు రాష్ట్ర కార్మిక నాయకుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత రవి ఇచ్చారు.
ప్రజా సమస్యలను శాసనసభలో ప్రస్తావించేందుకు నల్ల చొక్కాలతో అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు,బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకొని తీసుకోవడాన్ని బిఆర్ టియు రాష్ట్ర కార్మిక కార్మిక నాయకుడు గ్రహీత రవి తీవ్రంగా ఖండించారు.అనంతరం కార్మిక నాయకుడు రవి మాట్లాడుతూ ప్రజలచే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులను శాసనసభలోకి వెళ్లకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్య వ్యవస్థకు విరుద్ధమని, ముఖ్యంగా మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి,సునీత లక్ష్మారెడ్డిపై పోలీసులు దురుసుగా,అమానుషంగా ప్రవర్తిస్తున్నారని పోలీసులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై హైకోర్టు జోక్యం చేసుకుని ఎమ్మెల్యేలను అసెంబ్లీలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవద్దని, శాసనసభవ్యవహారాల్లో స్పీకర్ అధికారాలే కీలకమని స్పష్టం చేయడం ప్రభుత్వ వైఖరికి చెంపపెట్టు లాంటిదని తెలిపారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన ప్రభుత్వం వాటిని కాలరాయడం సరికాదు, ప్రజాప్రతినిధులకు ప్రభుత్వం బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
