అచ్చంపేట(తెలంగాణ సాహితి న్యూస్ ప్రతినిధి)తెలంగాణ రాష్ట్రం లో అసెంబ్లీ దళిత స్పీకర్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు మధు,నవీన్‌రెడ్డి అసభ్యకర వ్యాఖ్యలు చేయడం సరికాదని నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట కాంగ్రెస్ ఎస్సీ సెల్ తాలూకా అధ్యక్షుడు చింతల రాజగోపాల్ అన్నారు. మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి మోసం చేసిందని ఆరోపించారు.కాంగ్రెస్ ప్రభుత్వం దళితుడిని శాసనసభ స్పీకర్‌గా నియమించడంతో బీఆర్‌ఎస్ నేతలు ఓర్వలేక కుట్రలకు పాల్పడుతున్నారని విమర్శించారు.స్పీకర్‌పై దాడి చేయడం అంటే ప్రజాస్వామ్యంపై దాడి చేయడమేనని అన్నారు.
దళితుల పట్ల బీఆర్‌ఎస్ నేతలు తమ వైఖరిని మార్చుకోవాలని రాజగోపాల్ సూచించారు. సమావేశంలో కాంగ్రెస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు పొలమూరి రాజు, బల్మూరు మండల నేత వెంకటయ్య పాల్గొన్నారు.
Tags
Telangana
