మహబూబ్‌నగర్(తెలంగాణ సాహితి)గత మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి అంకితభావంతో కూడిన సేవలకు గుర్తింపుగా జిల్లా కాంగ్రెస్ కమిటీ,అధ్యక్షుడు ఎ.సంజీవ్ ముదిరాజ్‌ను గవర్నర్ కోటాలో శాసనమండలి సభ్యునిగా నామినేట్ చేయాలని మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలు బలంగా కోరుకుంటున్నారనీ ముదిరాజు సంఘం మొదటి హైద్రాబాద్ తొలి మేయర్ కోరివి క్రిష్ణ స్వామి,జిల్లా అధ్యక్షుడు పటేల్ రాకేష్ ముదిరాజు కోరుతున్నారు.గత 30 ఏళ్లుగా సంజీవ్ ముదిరాజ్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం నిబద్ధతతో,అంకితభావంతో పనిచేస్తున్నారనీ. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలో,కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన చేసిన కృషి అందరి ప్రశంసలను అందుకుందనీ.ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నాయకత్వంలో,కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడంలోనూ, రాహుల్ గాంధీ ఆశయాలను, దృక్పథాన్ని ముందుకు తీసుకెళ్లడంలోనూ సంజీవ్ ముదిరాజ్ కీలక పాత్ర పోషించారని. దశాబ్దాలుగా పార్టీకి అంకితభావంతో సేవలు అందించిన సంజీవ్ ముదిరాజ్ వంటి నిబద్ధత కలిగిన,నాయకుడికి తగిన రాజకీయ గుర్తింపు లభించాల్సిన అవసరం ఎంతైనా ఉందని. మహబూబ్‌నగర్ ప్రజల ఆకాంక్షలను,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని,గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా సంజీవ్ ముదిరాజ్‌ను నామినేట్ చేసే అంశాన్ని సానుకూలంగా పరిశీలించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి మరియు టీపీసీసీ,అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్‌ను గౌడ్ నీ కోరడం జరిగిందనీ పార్టీ కోసం దశాబ్దాల పాటు సేవలు అందించిన నాయకుడు.సంజీవ్ ముదిరాజ్‌కు తగిన అవకాశం కల్పించాలనీ, మహబూబ్‌నగర్ ప్రజల ఆకాంక్షలను గౌరవించలని పటేల్ రాకేష్ ముదిరాజ్ మరియు తదితర నాయకులు అశాభావం వ్యక్తం చేశారు.
Tags
Telangana
