“కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలి” డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్

 

“కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలి”
డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్.

మహబూబ్ నగర్ (తెలంగాణ సాహితి)నవాబ్‌పేట్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశం నేడు నవాబ్‌పేట్‌లోని స్టార్ ఫంక్షన్ హాల్‌లో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ టి. సుధాకర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సమావేశానికి మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు శ్రీ ఏ. సంజీవ్ ముదిరాజ్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలు, రాబోయే పార్టీ కార్యక్రమాలు మరియు సంస్థాగత నిర్మాణంపై విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ మాట్లాడుతూ.కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలుగా అంకితభావంతో పనిచేస్తూ, మండలంలో మంచి గుర్తింపు సంపాదించుకున్న సురేష్ గారు మొదటిసారిగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు.కాంగ్రెస్ పార్టీని దేశవ్యాప్తంగా మరింత బలోపేతం చేయడానికి చేపట్టిన సంస్థాగత కార్యక్రమంలో భాగంగా సురేష్ గారిని మండల అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. ఆయన బాధ్యతలు స్వీకరించిన అనంతరం బలమైన మండల కమిటీని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు.మండల కమిటీలో పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు తగిన అవకాశం కల్పించాలని సూచించారు. అదే విధంగా ప్రతి గ్రామంలో గ్రామ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని, గ్రామ కమిటీలతో పాటు ప్రతి బూత్‌లో బూత్ కమిటీలను ఏర్పాటు చేసి పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.ప్రతి బూత్ కమిటీలో యువతకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తూ, సుమారు పది మంది యువకులతో బలమైన బూత్ కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. 
యువత భాగస్వామ్యంతో పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత పటిష్టంగా తీర్చిదిద్దాలని అన్నారు.కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ సామాజిక న్యాయం కోసం పోరాడుతున్న పార్టీ అని పేర్కొన్నారు. మన నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారు ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా “జిత్నీ భాగీదారీ, ఉత్నీ హిస్సేదారీ” అనే నినాదంతో సామాజిక న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తున్నారని అన్నారు.అందువల్ల మనమందరం కాంగ్రెస్ కుటుంబ సభ్యులమనే భావనతో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ ముందుకు వెళ్లాలంటే ప్రతి ఒక్కరూ కొంత త్యాగం చేయాల్సిన అవసరం ఉంటుందని అన్నారు. పదవులు అందరికీ రాకపోయినా, పదవులు ఆశించకుండా పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే ప్రతి కార్యకర్తను గౌరవించడం మన బాధ్యత అని తెలిపారు.ఇటీవల అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) కూడా సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ, ఏర్పాటు చేసే ప్రతి కమిటీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, మహిళలు, యువతకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని నిర్ణయించిందన్నారు.ముఖ్యంగా మహిళలకు మరిన్ని అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలులోకి వచ్చే అవకాశాల నేపథ్యంలో, ఇప్పటి నుంచే మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించి వారికి రాజకీయంగా మరింత అవకాశాలు కల్పించాలని సూచించారు.కేవలం గ్రామ కమిటీలు, మండల కమిటీలు ఏర్పాటు చేయడంతోనే కార్యక్రమం పూర్తికాదని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ నామినేటెడ్ పోస్టుల్లో కూడా పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు అవకాశం కల్పించే విధంగా మన ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్నారని తెలిపారు.సంస్థాగతంగా పార్టీ కోసం పనిచేసి, ఏ పదవి రాకపోయినా అంకితభావంతో సేవలందించిన ప్రతి కార్యకర్తను గుర్తించి, వారికి కూడా నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించేలా ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారని అన్నారు.మార్కెట్ కమిటీలు, ముడా డైరెక్టర్ పదవులు, ఇతర నామినేటెడ్ పోస్టుల్లో కూడా పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి తగిన అవకాశాలు కల్పించాలని ఎమ్మెల్యే గట్టిగా కృషి చేస్తున్నారని తెలిపారు. 
ముఖ్యంగా జడ్చర్ల నియోజకవర్గానికి, మన ప్రాంతానికి ఎక్కువ ప్రాతినిధ్యం లభించేలా ఆయన ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి నవాబ్‌పేట్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి, ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు.ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తూ, వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వహించిన అనంతరం ఇప్పుడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సురేష్ కి అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు శ్రీ వేముల కృష్ణయ్య, టీపీసీసీ అధికార ప్రతినిధి శ్రీ జహీర్ అక్తర్, డీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీ బంగ్లా రవి, మాజీ మండల అధ్యక్షులు శ్రీ రాంచంద్రయ్య, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు శ్రీ నర్సిములు, జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి శ్రీ హరీష్ , ఉప సర్పంచ్ శ్రీ రాజశేఖర్, కాంగ్రెస్ నాయకులు శ్రీ అంజి ముదిరాజ్, అనోక్, మొహినుద్దీన్, రాకేష్ ముదిరాజ్, శ్రీశైలం ముదిరాజ్, ఆంజనేయులు, అలాగే నవాబ్‌పేట్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

Ad 2