మాజీ ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ నాయకుల ఘన నివాళులు.

జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో ఘనంగా నివాళుర్పించిన్న నాయకులు.

మహబూబ్ నగర్ (తెలంగాణ సాహితి)దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రజా నేత డా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు.

మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ గారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు డా. వైఎస్ రాజశేఖర రెడ్డి  చిత్రపటానికి పూలమాలలు వేసి, పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి  మాట్లాడుతూ, డా. వైఎస్ రాజశేఖర రెడ్డి పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసిన గొప్ప ప్రజానేత అని అన్నారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి, కోట్లాది ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. ఆయన ఆశయాలు, సేవా స్ఫూర్తిని ప్రతి కాంగ్రెస్ నాయకుడు ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

అనంతరం టీపీసీసీ అధికార ప్రతినిధి జహీర్ అక్తర్  మాట్లాడుతూ, డా. వైఎస్ రాజశేఖర రెడ్డి  పాలనలో రైతు సంక్షేమం, పేదల ఆరోగ్యం, విద్య, సంక్షేమ రంగాలకు అత్యంత ప్రాధాన్యత లభించిందని తెలిపారు. ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకునేందుకు పాదయాత్ర చేసి, వారి సమస్యల పరిష్కారానికి జీవితాంతం కృషి చేసిన నాయకుడిగా వైఎస్సార్ చరిత్రలో నిలిచిపోతారని పేర్కొన్నారు.

మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనితా రెడ్డి  మాట్లాడుతూ, డా. వైఎస్ రాజశేఖర రెడ్డి  మహిళలు, రైతులు, పేద కుటుంబాల అభ్యున్నతికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని అన్నారు. ఆయన చూపిన సేవా మార్గం, ప్రజల పట్ల ఉన్న అంకితభావం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని తెలిపారు. వైఎస్సార్ ఆశయాలను కొనసాగిస్తూ ప్రజలకు సేవ చేయడమే ఆయనకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి జహీర్ అక్తర్, డీసీసీ కోశాధికారి రాజేందర్ రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షులు బెక్కరి మధుసూదన్ రెడ్డి, వేముల కృష్ణయ్య, మీడియా సెల్ సీజే బెనహర్, టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ అజ్మత్ అలీ, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనితా రెడ్డి,తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని డా. వైఎస్ రాజశేఖర రెడ్డి కి ఘన నివాళులర్పించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

Ad 2