ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆధ్యక్షులు మాన్ పాడు బాలయ్య.
మహబూబ్ నగర్ (తెలంగాణ సాహితి)తెలంగాణ ఎరుకల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కళాభవన్ లో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఆధ్యక్షులు మాన్ పాడు బాలయ్య రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్, రాష్ట్ర అధ్యక్షులు పొన్నాల ఎలుసరి కృష్ణయ్య పాల్గొని వేరే సంఘాల్లో పనిచేసి ఈ రోజు తెలంగాణ ఎరుకల సంక్షేమ సంఘం(TYSS)ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలు నచ్చి సంఘం లో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించడం జరిగింది. సంఘం లో చేరిన ఎలుసరి బాలరాజు,మంగరాయి వెంకటేష్,ఎలుసరి శ్రీనివాసులు,నల్గొండ శాంతయ్య, నాగసారుతు పవన్ కుమార్ తదితరులు ఉన్నారు.
అనంతరం రాష్ట్ర అధ్యక్షులు కృష్ణయ్య మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా నీతిగా,నిజాయితీగా ఎరుకల జాతి సంక్షేమము కోసం, ఆత్మ గౌరవం కోసం, అభ్యున్నతి కోసం, హక్కుల కోసం మా వంతు పోరాటాలు చేస్తున్న విషయం తెలిసిందే. చదువుకున్న ఎరుకల విద్యావంతులు,మేధావులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు తదితరులు వెనుకబడిన వారి సంక్షేమానికి కృషి చేయాలని సూచించారు.
త్వరలో అన్ని మండలాల్లో జిల్లాలో నూతన కమిటీలు ఏర్పాటు చేసి రాష్ట్రంలో తెలంగాణ ఎరుకల సంక్షేమ సంఘంను బలోపేతం చేసేందుకు కృషి చేయాలని కోరారు.
ప్రస్తుత కమిటీని నియమించడం జరిగిందనీ జిల్లా అధ్యక్షులుగా మంగరాయి వెంకటేష్,ఉపాధ్యక్షులుగా ఏలసరి బాలరాజ్,, నల్లగొండ శాంతయ్య,నియమించడం జరిగిందనీ తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎరుకల సంక్షేమ సంఘం యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎలుసరి తిరుమలేశు, ఎలుసరి రామస్వామి ముద్దని చెన్నయ్య, కుంభ రామ్ చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
Tags
Telangana

