
మహబూబ్ నగర్ (తెలంగాణ సాహితి)అనారోగ్యంతో బాధపడుతున్న జర్నలిస్టుల కుటుంబాలకు ఎమ్మెస్సార్ ఫౌండేషన్ అండగా ఉంటుందని ఫౌండేషన్ చైర్ పర్సన్ మహతి రెడ్డి అన్నారు.ఆదివారం సీనియర్ జర్నలిస్టు ఆరగిద్ద అనీల్ కుమార్ భార్య రాఘవేంద్రమ్మ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న మహతి రెడ్డి స్పందించి బాదిత కుటుంబ సభ్యులను ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నరేందర్ చారి, డబ్ల్యూజేఐ కన్వీనర్ కటిక రవీందర్,ఐజేయు అధ్యక్షుడు కాటం నాగరాజు అద్వర్యంలో కలిసి రూ.20,000చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా మహతి రెడ్డి మాట్లాడుతూ.మా తండ్రి మారెపల్లి సురేందర్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని సేవా కార్యక్రమాలు చేపట్టానని తెలిపారు.ఇప్పటి వరకు మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎంబిబిఎస్, నర్సింగ్ విద్యకు దూరం అవుతున్న వారి ఆర్థిక పరిస్థితిని గమనించి వాళ్ళందరికీ తోడ్పాటును శక్తి మేరకు సహాయం చేసిందన్నారు.ఈ ఫౌండేషన్ అడ్డు పెట్టుకొని లబ్ది పొందాలని భావించటం లేదని, కేవలం సేవా భావంతోనే ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు.
పౌండేషన్ ఆధ్వర్యంలో ఎవరికి ఆపద వచ్చిన అండగా నిలిచిన సహాయం అందిస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు గోవర్ధన్ గౌడ్, సంక్షేమ సంఘం అధ్యక్షుడు అశోక్ కుమార్,ఐజేయు అధ్యక్షుడు కాటం నాగరాజు,మణి ప్రసాద్, రాఘవేందర్,కృష్ణ తదితరులు పాల్గొన్నారు.