ప్రజాయుద్ధ నౌక గద్దర్ విగ్రహానికి స్థలం కేటాయించండి

 

వరంగల్ పచ్చిమ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డికి ప్రజా సంఘాల వినతి.

హన్మకొండ (తెలంగాణ సాహితి)హన్మకొండ జిల్లా కేంద్రంలో ప్రజాయుద్ధ నౌఖ గద్దరన్న విగ్రహం ఏర్పాటు చేయడానికి స్థలం కేటాయించాలని కోరుతూ వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిని శుక్రవారం ప్రజా సంఘాల నాయకులు కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. హనుమకొండ జిల్లా కలెక్టర్ కు ప్రజా సంఘాల నాయకులు ఇచ్చిన వినతిపత్రాన్ని వెంటనే ఎమ్మెల్యే ఫార్వర్డ్ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ఏర్పాటులో గద్దరన్న పాత్ర కీలకమైందని అలాంటి గద్దరన్న ఆశయ సాధనలో భాగంగా ఆయన విగ్రహాలను రాష్ట్రమంతా ఏర్పాటు చేసుకొని పీడిత ప్రజల విముక్తిలో భాగస్వాములు కావాలని వారు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో గద్దర్ విగ్రహ స్థాపన కమిటి చైర్మన్ కోండ్ర నర్సింగరావు, బిసి జాక్ నాయకులు డాక్టర్ తిరునహరి శేషు, విసికె పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జిలుకర శ్రీనివాస్, ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్, డి బి ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చుంచు రాజేందర్, గజాల గోవర్ధన్, గద్దర్ సాంబయ్య, పి. రమేష్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

Ad 2