పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరీ బాధ్యత.
అచ్చంపేట, సెప్టెంబర్ 13(తెలంగాణ సాహితి న్యూస్ ప్రతినిధి) నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలోని లక్ష్మీ థియేటర్ సమీపంలోవినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా అచ్చంపేట పట్టణంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
బీబీసీ, కళాంజలి ఫ్యాషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు, డీసీసీ అధ్యక్షులు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, ఆయన సతీమణి, సీబీఎం ట్రస్ట్ చైర్పర్సన్ డాక్టర్ అనురాధ పాల్గొని నిర్వాహకులను అభినందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులు మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసిన విగ్రహాల వల్ల నీటి వనరులు కలుషితమయ్యే ప్రమాదం ఉందని, అందుకు బదులుగా సహజసిద్ధమైన మట్టితో తయారు చేసిన వినాయక ప్రతిమలను ప్రతిష్ఠించి పూజించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు.
మట్టి వినాయక ప్రతిమలు నీటిలో సులభంగా కలిసిపోవడంతో పాటు పర్యావరణానికి హాని కలిగించవని పేర్కొన్నారు. భక్తి, సంప్రదాయాలను పాటిస్తూనే ప్రకృతి పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.
‘భక్తితో పూజిద్దాం.బాధ్యతతో ప్రకృతిని కాపాడుదాం’అనే సందేశంతో మట్టి వినాయకుల ఉచిత పంపిణీ చేపట్టడం అభినందనీయమని ఎమ్మెల్యే దంపతులు పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై మరింత అవగాహన పెరుగుతుందని తెలిపారు.
వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయకులను ఉపయోగించడం వల్ల సంప్రదాయాన్ని కొనసాగించడంతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించేందుకు అవకాశం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో స్థానికులు, భక్తులు, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
Tags
Telangana
