వైభవంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు

- అమ్మవారికి ఘనంగా కుంకుమ అర్చన. 
- ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలీ టీపీసీసీ       ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి
.

తొర్రూరు(తెలంగాణ సాహితి)మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఆధ్యాత్మిక వాతావరణంలో సాగుతున్నాయి ఈ వేడుకలలో భాగంగా ఆదివారం నాడు లక్ష్మీదేవి అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా ఘనంగా నిర్వహించారు ఈ పూజా మహోత్సవానికి టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు అయ్యరు.
వేద మంత్రోచ్ఛారణలు మంగళవాయిద్యాల నడుమ అమ్మవారికి విశేష అర్చనలు జరిపారు ఈ భక్తి శ్రద్ధలతో కూడిన వేడుకలో స్థానిక మహిళలు మహిళా ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ పాలకుర్తి నియోజకవర్గ ప్రజలందరూ అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు.


ఆ విఘ్నేశ్వరుడు అమ్మవారి కరుణాకటాక్షాల వల్ల గ్రామాలు సుభిక్షంగా ఉండాలని పాడిపంటలు సమృద్ధిగా పండాలని ప్రార్థించినట్లు పేర్కొన్నారు ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు మరియు స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

Ad 2