బీసీ గురుకులంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆకస్మిక తనిఖీ

అచ్చంపేట (తెలంగాణ సాహితి) నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని శ్రీపురం రోడ్డులో ఉన్న మహాత్మ జ్యోతిబాఫూలే బీసీ గురుకుల బాలుర పాఠశాల, కళాశాలను జిల్లా డీసీసీ అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ఆయన ఆదివారం పాఠశాలను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా పాఠశాలలో అందుతున్న వసతులు, భోజన నాణ్యత, విద్యార్థుల భద్రతా ప్రమాణాలను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు కట్టుబడి ఉందన్నారు.ఉపాధ్యాయులు ఎల్లవేళలా విద్యార్థులకు అందుబాటులోఉంటూ,వారి విద్యాభివృద్ధికి నిరంతరం తోడ్పడాలని సూచించారు.
విద్యార్థుల సమస్యల పట్ల ఉపాధ్యాయులు, సిబ్బంది అలసత్వం వహించకూడదని స్పష్టం చేశారు. ఈ తనిఖీ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ విభాగాధిపతులు మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

Ad 2