
మహబూబ్ నగర్ (తెలంగాణ సాహితి)జిల్లా బి .సి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ బంగ్లా సమీపంలోని విశ్వకర్మ దేవాలయంలో నిర్వహించిన భగవాన్ శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి వేడుకల్లో కలెక్టర్ ఖుష్బూ గుప్తా పాల్గొన్నారు. విశ్వకర్మ చిత్రపటానికి పూలమాల వేసి పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విశ్వకర్మ చేతివృత్తులు, కళలు, శిల్పకళ,వాస్తుకళ,నైపుణ్యాలకుఆద్యుడనిఅన్నారు.
తరతరాలుగా తమ వృత్తి నైపుణ్యాలను కొనసాగిస్తూ సమాజానికి సేవలందిస్తున్న చేతివృత్తిదారులను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.యువత సంప్రదాయ వృత్తుల్లోని నైపుణ్యాలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానం చేసుకుని స్వయం ఉపాధి దిశగా ముందుకు సాగాలని సూచించారు.
చేతివృత్తిదారుల సంక్షేమం, వృత్తుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.కార్యక్రమంలో మేయర్ జి. మమత, జిల్లా బి.సి సంక్షేమ అభివృద్ధి శాఖ అధికారి విష్ణునందన్ తదితరులు పాల్గొన్నారు.