మక్తల్ (తెలంగాణ సాహితి)శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని మక్తల్ పట్టణంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో వాకిటి లలిత గారు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి చేరుకుని శ్రీకృష్ణుడికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. ఆలయంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు.
కృష్ణాష్టమి సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది. శ్రీకృష్ణుని ఆశీస్సులు ప్రతి కుటుంబంపై ఉండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని లలిత గారు ఆకాంక్షించారు.
Tags
Telangana
