మహబూబ్‌నగర్(తెలంగాణసాహితి)నీటిపారుదల మరియు ఆయకట్టు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఓఅండ్‌ఎం వర్క్ ప్లాన్ నిధుల కింద రూ.17.70 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన నాణ్యత నియంత్రణ మరియు తనిఖీ ఉప విభాగం–1 కార్యాలయ భవనాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల కార్యాలయాలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా అధికారులు, సిబ్బంది మరింత సమర్థవంతంగా పనిచేసే అవకాశం ఉంటుందని అన్నారు. నీటిపారుదల రంగ అభివృద్ధి, ఆయకట్టు విస్తరణతో పాటు నాణ్యత ప్రమాణాల పరిరక్షణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా అధికారులు అంకితభావంతో పనిచేయాలని సూచించారు.

కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్,డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిరాజ్ ఖాద్రీ, నాయకులు మైత్రి యాదయ్య, నీటిపారుదల శాఖ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Tags
Telangana